English | Telugu

వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న కేతికా శ‌ర్మ‌?

మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ఉప్పెన‌`తో తెలుగునాట క‌థానాయ‌కుడిగా తొలి అడుగేశాడు వైష్ణ‌వ్ తేజ్. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా మెప్పించాడు. త్వ‌ర‌లోనే ఈ మెగా కాంపౌండ్ యంగ్ హీరో.. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందించిన న‌వ‌లాధారిత చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న స‌ద‌రు అడ్వెంచ‌ర‌స్ మూవీ.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాణంలో వైష్ణ‌వ్ తేజ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీని `ఆదిత్య వ‌ర్మ‌` (`అర్జున్ రెడ్డి` త‌మిళ రీమేక్) ఫేమ్ గిరీశ‌య్య తెర‌కెక్కిస్తాడ‌ని టాక్. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా.. ఇదే ఏడాది చివ‌ర‌లో రిలీజ్ కానుంద‌ని వినికిడి. కాగా, ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ కి జంట‌గా `రొమాంటిక్` ఫేమ్ కేతికా శ‌ర్మ ఎంపికైంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే వైష్ణ‌వ్ చిత్రంలో కేతిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.