English | Telugu

మ‌రోసారి లెక్చ‌ర‌ర్ గా వెంకీ?

విక్ట‌రీ వెంక‌టేశ్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టించిన `సుంద‌ర‌కాండ‌` (1992) చిత్రం.. ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంత‌రం ఇదే త‌ర‌హాలో ఫ‌న్నీగా సాగే లెక్చ‌ర‌ర్ రోల్ లో మ‌రోసారి న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట వెంకీ.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `పెళ్ళి చూపులు` ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాన్నాళ్ళుగా ప్రచారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత హార్స్ రేసింగ్ నేప‌థ్యంలో వెంకీతో మూవీ చేయాల‌ని త‌రుణ్ భావించాడు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో, రీసెంట్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స‌బ్జెక్ట్ ని వినిపించాడ‌‌ట‌. హిలేరియ‌స్ గా సాగే ఈ చిత్రంలో వెంకీ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టిస్తార‌ని టాక్. జూన్ లేదా జూలైలో వెంకీ - త‌రుణ్ కాంబో మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ వెంచ‌ర్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం వెంకీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో `నార‌ప్ప‌` మే 14న రిలీజ్ కానుండ‌గా.. `దృశ్యం 2` జూన్ లేదా జూలైలో రాబోతోంది. ఇక `ఎఫ్ 3` ఆగ‌స్టు 27న సంద‌డి చేయ‌నుంది.