English | Telugu

నితిన్‌తో బ‌న్నీ డైరెక్ట‌ర్?

రీసెంట్ గా రిలీజైన `రంగ్ దే`తో మ‌రో రొమాంటిక్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు యూత్ స్టార్ నితిన్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అంధాధున్`కి రీమేక్ గా తెర‌కెక్కుతున్న‌ `మాస్ట్రో`లో న‌టిస్తున్నాడు. మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా, న‌భా న‌టేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగర్ బాణీలు అందిస్తున్న `మాస్ట్రో` జూన్ 11న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `మాస్ట్రో` త‌రువాత నితిన్ చేయ‌బోయే సినిమాపై ఫిల్మ్ న‌గ‌ర్ లో ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. అదేమిటంటే.. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ మూవీ చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని టాక్. న‌టుడు, ర‌చ‌యిత అయిన వ‌క్కంతం వంశీ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన `నా పేరు సూర్య నా పేరు ఇండియా`తో డైరెక్ట‌ర్ అయ్యాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన స‌ద‌రు చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మ‌రి.. నితిన్ కాంబో మూవీతోనైనా వంశీ విజ‌యాన్ని అందుకుంటాడేమో చూడాలి. త్వ‌ర‌లోనే నితిన్ - వంశీ ఫ‌స్ట్ జాయింట్ వెంచ‌ర్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` ఫేమ్ కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో `ప‌వ‌ర్ పేట‌` పేరుతో ఓ సినిమాని చేయ‌నున్నాడు నితిన్. చాన్నాళ్ళుగా వార్త‌ల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది.