English | Telugu

2022కి ర‌వితేజ‌, మారుతి ఫిక్స్?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి ఓ సినిమా చేయాల్సింది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. యాక్ష‌న్ హీరో గోపీచంద్ తో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`గా ఆ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు మారుతి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ కామిక్ ఎంట‌ర్ టైన‌ర్.. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 1న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` త‌రువాత ర‌వితేజ‌తోనే మారుతి నెక్స్ట్ వెంచ‌ర్ ఉంటుంద‌ని టాక్. ఇప్ప‌టికే ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. అన్నీ కుదిరితే 2022 ఆరంభంలో ర‌వితేజ‌, మారుతి ఫ‌స్ట్ కాంబో మూవీ ప‌ట్టాలెక్క‌వ‌చ్చ‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ర‌వితేజ‌, మారుతి జాయింట్ వెంచ‌ర్ పై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం `ఖిలాడి` చేస్తున్నారు. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. మే 28న రిలీజ్ కానుంది. ఆ త‌రువాత `నేను లోక‌ల్` డైరెక్ట‌ర్ త్రినాథ‌రావ్ న‌క్కిన కాంబినేష‌న్ లో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌నున్నారు ర‌వితేజ‌. మే నెల‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది.