English | Telugu

సీఎంగా రామ్ చ‌ర‌ణ్?

ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ పాన్ - ఇండియా మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పోషించ‌నున్న పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఇందులో చ‌ర‌ణ్ ఓ యువ ముఖ్యమంత్రిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడట‌. `ఒకే ఒక్క‌డు` త‌ర‌హాలో విచిత్ర ప‌రిస్థితుల్లో సీఎం అయ్యే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని టాక్. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ఈ ఏడాది రామ్ చ‌ర‌ణ్ నుంచి రెండు మ‌ల్టిస్టార‌ర్స్ రానున్నాయి. మే 13న త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌ల‌సి న‌టించిన `ఆచార్య‌` రిలీజ్ కానుండ‌గా.. అక్టోబ‌ర్ 13న యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ తో జ‌ట్టుక‌ట్టిన `ఆర్ ఆర్ ఆర్` జ‌నం ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.