English | Telugu

`సంచారి`గా ప‌వ‌ర్ స్టార్?

`వ‌కీల్ సాబ్`తో రి-ఎంట్రీ బాట ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వ‌రుస సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నారు. రేపు (ఏప్రిల్ 9) `వ‌కీల్ సాబ్` రిలీజ్ కానుండ‌గా.. సెప్టెంబ‌ర్ లో `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` రీమేక్ విడుద‌ల కానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పిరియ‌డ్ డ్రామా `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` 2022 సంక్రాంతికి సంద‌డి చేయ‌నుంది. ఆపై హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ 2022 వేస‌విలో జ‌నం ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. `గ‌బ్బ‌ర్ సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ప‌వ‌న్, హ‌రీశ్ కాంబినేష‌న్ లో రానున్న సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రానికి `సంచారి` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. క‌థానుసారం.. ఈ టైటిల్ యాప్ట్ గా ఉంటుంద‌ని టీమ్ భావిస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రం జూలై నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించ‌నున్నారు.