English | Telugu

`ఉప్పెన‌` హీరోకి త్రివిక్ర‌మ్ క‌థ‌?

`ఉప్పెన‌` చిత్రంతో యువ‌త‌రాన్ని విశేషంగా అల‌రించాడు వైష్ణ‌వ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయితేజ్ త‌మ్ముడు అనే ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినా.. మొద‌టి సినిమాతోనే త‌న‌దైన ముద్ర‌వేశాడు వైష్ణ‌వ్. అనూహ్య విజ‌యం సాధించిన `ఉప్పెన‌`తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణ‌వ్.. త్వ‌ర‌లోనే క్రిష్ రూపొందించిన `జంగిల్ బుక్` (ప్ర‌చారంలో ఉన్న పేరు)తో సంద‌డి చేయ‌బోతున్నాడు. `కొండ‌పొలం` న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

కాగా, ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాణంలో త‌న మూడో చిత్రాన్ని చేయ‌నున్నాడు వైష్ణ‌వ్. ఓ నూత‌న ద‌ర్శ‌కుడు ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తాడ‌ని టాక్.

ఇదిలా ఉంటే.. త‌న చిన‌మావ‌య్య, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత సంస్థ‌లోనూ వైష్ణ‌వ్ హీరోగా ఓ సినిమా రానుంద‌ట‌. అంతేకాదు.. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ క‌థ‌ను స‌మ‌కూర్చ‌నున్నార‌ని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.