English | Telugu

చ‌ర‌ణ్‌కి తండ్రి పాత్ర‌లో చిరు?

త‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మ‌గ‌ధీర‌` (2009), `బ్రూస్ లీ` (2015) చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో మెరిశారు మెగాస్టార్ చిరంజీవి. క‌ట్ చేస్తే.. చిరు రి-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` (2017)లో త‌నో కామియో చేశారు చ‌ర‌ణ్. నాలుగేళ్ళ త‌రువాత ఇప్పుడు ఈ ఇద్ద‌రు.. `ఆచార్య‌` చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు. చిరు మెయిన్ లీడ్ గా న‌టిస్తుండ‌గా.. ఆ పాత్ర‌కి స్ఫూర్తినిచ్చే మ‌రో క‌థానాయ‌కుడి పాత్ర‌లో చ‌ర‌ణ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. చిరు, చ‌ర‌ణ్ ఐదోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ కి తండ్రి పాత్ర‌లో అతిథిగా మెరవ‌నున్నార‌ట చిరు. అదే గ‌నుక నిజ‌మైతే.. ఇది మెగాభిమానుల‌కు ఆనందాన్నిచ్చే అంశ‌మే. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ప్ప‌టికీ.. తండ్రీకొడుకులుగా నిజ‌జీవిత పాత్ర‌ల్లో చిరు, చ‌ర‌ణ్ న‌టించింది లేదు. ఓ ర‌కంగా.. శంక‌ర్ సినిమాకి ఇది క‌లిసొచ్చే `మెగా` ఫ్యాక్ట‌ర్ అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబో మూవీలో చిరు ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ప్ర‌ముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. జూలై లో సెట్స్ పైకి వెళ్ళనుంద‌ని బ‌జ్.