English | Telugu

ప‌వ‌న్‌కి జోడీగా నిత్యా మీన‌న్?

ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి స్టార్ రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మ‌ల్టిస్టార‌ర్.. మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` ఆధారంగా తెర‌కెక్కుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా త‌యారుచేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచ‌ల‌న త‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప‌వ‌న్ కి జోడీగా డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి న‌టించ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, కాల్షీట్ల స‌మ‌స్య కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ ని ఆమె మిస్స‌యింద‌ని టాక్. కాగా, ఇప్పుడా పాత్ర‌ని కేర‌ళ‌కుట్టి నిత్యా మీన‌న్ చేయ‌బోతున్న‌ట్లు బ‌జ్. అదే గ‌నుక నిజ‌మైతే.. ప‌వ‌న్ తో నిత్య న‌టించే మొద‌టి సినిమా ఇదే అవుతుంది. తెలుగునాట‌ ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ (జ‌నతా గ్యారేజ్), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి)తో క‌లిసి న‌టించిన నిత్యా మీన‌న్ కి ఆయా చిత్రాలు మంచి విజ‌యాల‌నే అందించాయి. ఈ నేప‌థ్యంలో.. ప‌వ‌న్ కాంబో మూవీ కూడా స‌క్సెస్ ని అందిస్తుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ - రానా మ‌ల్టిస్టార‌ర్ లో నిత్య ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. ఇక ఇదే చిత్రంలో రానాకి జంట‌గా ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌టిస్తోంది.

ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.