English | Telugu
అల్లు అర్జున్ రికార్డ్‌ను చిరంజీవి బద్దలు కొడతాడా!
Updated : Feb 16, 2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వింటేజీ మెగాస్టార్ ను వెనక్కి తీసుకుని వచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై నెలరోజులు దాటింది. అయినా సరే ఇప్పటికీ 300 థియేటర్లలో సినిమా ఆడుతోంది.
మంచి కలెక్షన్లు వస్తున్నాయి.ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి జిల్లాలలో మంచి కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. శివరాత్రి సినిమాలు తేడా పడితే ఈజీగా 50 రోజులపాటు ఈ సినిమాలు ఈ సినిమా చాలా థియేటర్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 300 థియేటర్లలో సినిమా ఆడుతోంది. కాబట్టి తక్కువలో తక్కువ 150 థియేటర్లలో అయినా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో 50 రోజులపాటు పూర్తి చేసుకున్న సినిమాలు పెద్దగా లేవు. అలా వైకుంఠపురంలో సినిమా 175 సెంటర్లలో డైరెక్ట్ గా ప్లస్ షిఫ్ట్ పద్ధతుల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను వాల్తేరు వీరయ్య బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. సంక్రాంతి సినిమాలో శివరాత్రి సినిమాలు సరిగా ఆడకపోతే వాల్తేరు వీరయ్య అల వైకుంఠపురంలో రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది.