English | Telugu

ఆ విషయంలో నాగార్జున కరెక్ట్ అంటున్న జగపతిబాబు!

జగపతిబాబు... టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా మహిళా అభిమానులను ఆ రేంజ్ లో సొంతం చేసుకున్నారు. విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. క్షేత్రం తరువాత హీరో పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. సరికొత్త ఇన్నింగ్స్ శ్రీకారం చుట్టారు. బాలకృష్ణ నటించిన బోయపాటి శ్రీను చిత్రం లెజెండ్ సినిమాతో పవర్ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇందులో జగపతిబాబు నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ మూవీతో విలన్ పాత్రల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. జగపతిబాబు ఇప్పటికీ అదే తరహా పాత్రలో నటిస్తూ వస్తున్నారు. ప్రభాస్- ప్రశాంత నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో పవర్ఫుల్ విల‌న్ రాజమానారుగా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ లోనూ సైతం సినిమాలు చేస్తున్నారు. రంజాన్ విడుద‌ల సంద‌ర్భంగా రూపొందుతున్న స‌ల్మాన్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కిసీ కా బాయ్.. కిసీకీ జాన్ చిత్రంలో న‌టిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సైంధవ్ చిత్రంలో కూడా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇక జగపతిబాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నారు. రుద్రాంగి పేరుతో ఈ మూవీ రూపొందుతోంది.ఈ మూవీ ద్వారా అజయ్ సామ్రాట్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తాజాగా నాగార్జున విషయం గురించి జగపతిబాబు మాట్లాడుతూ ఒక్కో హీరోకు ఒక్కో నెట్ వ‌ర్త్ ఇంత అని ప్రచారం చేస్తున్నారు.

ఇదే తరహాలో మీ నెట్ వ‌ర్త్ ఎంత అన్న ప్ర‌శ్న‌కు జ‌గ‌ప‌తిబాబు స‌మాధానం ఇస్తూ వాటి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. డబ్బు పెరిగే కొద్ది ఇబ్బందులు వ‌స్తూ ఉంటాయి. డ‌బ్బున్న దగ్గరనుంచి అన్ని ఇబ్బందులే తప్ప లాభం లేదు. ఈ విషయంలో నాగార్జున కరెక్ట్ అని చెబుతాను. తనకు సంపాదించడం తెలుసు. ఖర్చు పెట్టడం తెలుసు. ఆ డబ్బుని ఎలా ఎంజాయ్ చేయాలో తనకు తెలుసు. అంతేకాకుండా డబ్బుకు ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు. తన టైం కు ఎంత ఇవ్వాలో అవతలి వాళ్లకు ఎలా ఖర్చు పెట్టాలో తనకు బాగా తెలుసు. బ్యాలెన్స్ చేయగలరు. చాలామందికి డబ్బు విషయంలో బ్యాలెన్స్ లేదు.... అంటూ చెప్పుకొచ్చారు. జగపతిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.