English | Telugu
అందరు ప్రేమ్ రక్షిత్ కావాలంటున్నారు!
Updated : Feb 17, 2023
మట్టిలో మాణిక్యాలు అనే ఊతపదం ఊరికే రాలేదు. ఈ సామెతకు ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఎవరైనా కష్టపడందే పైకి రారు. ఇక విషయానికి వస్తే మట్టిలో మాణిక్యం అనే ఆ కోవలోకి చెందిన వ్యక్తి ప్రేమ రక్షిత మాస్టర్ కూడా. నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తం మారుమోగేలా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని మరో మెట్టెక్కించింది. అయితే దేశం మొత్తం గర్వించేలాగా చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇప్పుడు ఆయన తన సక్సెస్ తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. భారీ అవకాశాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్టార్ హీరోల చిత్రాలకు పని చేస్తున్నారు. దర్శక నిర్మాతలు హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.వరుస చాన్సులతో ఖాళీ లేకుండా ఉన్నారు.
బాలకృష్ణ వీరసింహారెడ్డిలో మాస్ మొగుడు వచ్చాడే పాటకు నృత్యరీతులు సమకూర్చారు. ఆ పాట ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. దసరాలోని ధూమ్ ధామ్ దోస్తాన్, సుకుమార్- అల్లు అర్జున్ పుష్ప2, దిగ్గజ దర్శకుడు శంకర్ -రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్సీ15, కమలహాసన్ ఇండియన్ 2,మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ లకు పనిచేస్తున్నారు. అలా ఈ సినిమాలన్నింటికి ఒక్క పాటను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇలా తను కొరియోగ్రఫీ చేసిన పాటలు హిట్ అయితే ప్రేమ్ రక్షిత్ మరింత ఉన్నత స్థాయిని అందుకోవడం ఖాయం.
గతంలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ అవ్వకముందు ప్రభుదేవా, లారెన్స్,రాజు సుందరం వంటి డాన్స్ మాస్టర్ లకు అసిస్టెంట్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అలా అలా కొరియోగ్రాఫర్ గా మారారు. ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రాజమౌళినే . రాజమౌళి -ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చత్రపతి సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తర్వాత వెంటనే విక్రమార్కుడు, యమదొంగ చిత్రాలు చేశారు. ఇలా దాదాపు రాజమౌళి సినిమాలన్నింటికీ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఇంకా ఎందరో దర్శకులతో సూపర్ హిట్ సాంగ్లకు నృత్య రీతులు సమకూర్చారు.