English | Telugu
స్టార్స్ ప్లాన్ వర్కౌట్ అయితే ఇక అదుర్స్!
Updated : Feb 16, 2023
సినిమా బాగుండడమే కాదు ఆ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. పోటీగా సినిమాలు లేకుండా ఉండాలి. మంచి ప్రమోషన్ చేయాలి. సినిమా కంటెంట్ నచ్చేలా ఉండాలి.. సరైన సమయంలో విడుదల చేయాలి. అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయాలి. ప్రేక్షకులను దియేటర్లకు రప్పించేలా చేయగలగాలి... ఇలాంటి అంశాలు ఎన్నో కలిస్తేనే ఓ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో మన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. నాని దసరా, ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ 30 చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా చిత్రం మార్చి 30న అంటే గురువారం విడుదల కానుంది.
ఈ సమయంలో ఏ సినిమాలు పోటీగా లేవు. దాంతో వీకెండ్ హాలిడేస్ తో ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ క్లిక్ అయితే ఆడియన్స్ భారీగా వస్తారు. ఇక సలార్ విషయానికి వస్తే సెప్టెంబర్ 8న గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. లాంగ్ వీకెండ్ ఉండనుంది. వినాయక చవితి హడావుడి కూడా ఉంటుంది. దాంతో పండుగను పురస్కరించుకొని ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతారు. ఇక ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న శుక్రవారం విడుదల కానుంది. ఎన్టీఆర్ నటించే చిత్రం కనుక వీకెండ్ ని క్యాష్ చేసుకుంటుంది. అటు ఇటుగా అప్పుడే స్టూడెంట్స్‌కు పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ ఎన్టీఆర్ 30కి కలిసి రానున్నాయి. ఈ విధంగా ఈ మూడు చిత్రాలు మంచి డేట్స్ ప్లాన్ చేసుకొని విడుదల కానున్నాయి. ఇలా కలిసొచ్చే అంశాలతో ఈ మూడు చిత్రాలు కంటెంట్ కూడా క్లిక్ అయితే బాక్సాఫీస్ మోత మోగడం ఖాయమని చెప్పాలి.