English | Telugu
రామ్ చరణ్ డ్యాన్స్ చూసి షాకైన శంకర్!
Updated : Feb 16, 2023
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే అందులో అదిరిపోయే స్టెప్పులు ఉండటం కామన్. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' కోసం చరణ్ తన డ్యాన్స్ డోస్ ని మరింత పెంచబోతున్నాడట.
శంకర్ సినిమాలలో పాటలకు ప్రత్యేక స్థానముంటుంది. ఆయన ప్రతి పాటని భారీస్థాయిలో రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు 'RC 15' విషయంలోనూ అదే చేయబోతున్నారు. ఇందులో పాటల కోసమే ఏకంగా రూ.40 కోట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం జానీ, ప్రేమ్ రక్షిత్, ప్రభుదేవా, గణేష్ ఆచార్య, బాస్కో మార్టిస్ ఇలా బడా కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
అసలే శంకర్ సాంగ్స్ తెరకెక్కించడంలో దిట్ట. దానికితోడు చరణ్ లాంటి మంచి డ్యాన్సర్ దొరికాడు. అందుకే శంకర్ 'RC 15'లో సాంగ్స్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుండగా, తాజాగా జరిగిన సాంగ్ షూట్ లో చరణ్ తన డ్యాన్స్ తో డైరెక్టర్ శంకర్ ని ఆశ్చర్యపరిచాడట. సింగల్ టేక్ లో 80 సెకన్ల నిడివి గల స్టెప్ వేసి చరణ్ ఆకట్టుకున్నాడట. చరణ్ డ్యాన్స్ స్కిల్స్ చూసి శంకర్ తో పాటు మూవీ టీమ్ అంతా ఫిదా అయ్యారట.