English | Telugu
షాకింగ్ రెమ్యూనరేషన్!
Updated : Feb 16, 2023
టాలీవుడ్ లో కొత్తదనంతో కూడిన కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు యంగ్ హీరో నిఖిల్.హ్యాపీడేస్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. యువత, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అర్జున్ సురవరం తో స్పెషల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయారు.
కృష్ణ తత్వంతో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కూడా బాగా నచ్చేసింది. ఈ సక్సెస్ తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. కార్తికేయ 1ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ2 మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ గా నిలిచింది. ఆయన కెరీర్ లోనే 100కోట్ల సినిమాగా నిలిచింది. ఆ ఉత్సాహంతోనే రీసెంట్‌గా 18 పేజెస్ అనే ఫీల్ గుడ్ హిట్టును అందుకున్నారు. అది కూడా ఆకట్టుకుంది.
తదుపరి సినిమాల కథల విషయంలో బాగా ఫోకస్ పెట్టారు. మిగతా హీరోలు రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలకు ఓటేస్తుంటే ఆయన మాత్రం భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు భారీ సక్సెస్ అందుకోవడంతో ఆయనతో పని చేసేందుకు దర్శక నిర్మాతలు భారీ సంస్థలు కూడా ఆసక్తి చెబుతున్నాయి. మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచేశారట. ఆయన మార్కెట్ కూడా పెరగడంతో నిఖిల్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారట.
దీంతో తన తొలి సినిమాకు 25 వేల పారితోషకం తీసుకున్న నిఖిల్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 12 నుంచి 14 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిఖిల్‌తో సినిమా చేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే త్వరలో నిఖిల్ స్పై చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్న కథానాయక.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.