English | Telugu
హన్సిక-సోహెల్ పెళ్ళిలో స్పెషల్ లైవ్ సాంగ్!
Updated : Mar 12, 2023
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతీ శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ గా రిలీజ్ అవుతున్న 'హన్సిక లవ్ షాదీ డ్రామా' సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. గతవారం విడుదలైన ఎపిసోడ్‌లో హన్సిక తన పెళ్ళి గోల్ఫ్ గ్రౌండ్ లో జరగాలని కోరింది. దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హన్సిక మేనేజర్, సోహెల్ మేనేజర్ చెప్పారు. ఈవెంట్ మేనేజర్స్ హన్సిక పెళ్ళి కోసం ఏర్పాటు చేసినవన్ని ఆకట్టుకున్నాయి. కాగా వాటి కోసం ఎంతగానో కష్టపడ్డారని ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
హన్సిక పెళ్ళికి తన క్లోజ్ ఫ్రెండ్ శ్రియా రెడ్డి రాదేమోనని మొదట భాదగా ఉందని చెప్పింది. అయితే తనని సర్ ప్రైజ్ చేస్తూ శ్రియా రెడ్డి వచ్చింది. దాంతో తనకి పూర్తి కంఫర్ట్ లభించిందని హన్సిక అంది. "తన గురించి చెప్పాలంటే.. తను నాకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్.. నా పెళ్ళిలో ఎలా ఉండాలి? ఏం చేయాలి అని మేమిద్దరం చాలా మాట్లాడుకునేవాళ్ళం" అని చెప్పింది. ఆ తర్వాత హన్సిక వాళ్ళ అమ్మ పెళ్ళిలో భోజనానికి వాడే ప్లేట్ల డిజైన్ కొత్తగా కావాలని చెప్పింది. ఏదీ కూడా సాధారణంగా ఉండకూడదు. అన్నీ అరుదైనవిగా అందంగా ఉండాలని చెప్పి అక్కడ మేనేజర్ తో చెప్పడంతో వాళ్ళు అలాగే ఏర్పాట్లు చేసారు.
అయితే పెళ్ళిలో ఒక స్పెషల్ పర్సన్ తో లైవ్ సాంగ్ పాడిద్దామని హన్సిక-సోహెల్ ప్లాన్ చేసారు. అతను ఫేమస్ సింగర్ అయిన కుట్లీ ఖాన్. అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను లైవ్ లో పాడిన పాటతో ఆ ప్లేస్ అంతా సంగీతంలో మునిగితేలారు. ఫేజ్ ద మ్యూజిక్ పేరుతో విడుదలైన ఈ ఐదవ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత రాబోయే ఎపిసోడ్ ప్రోమోని ఈ ఎపిసోడ్ చివరన యాడ్ చేసారు. ఆ ప్రోమోలో గోల్ఫ్ గ్రౌండ్ లోకి హార్స్ లతో పాటుగా ప్లేయర్స్ రావడం చూపించారు. దీంతో రాబోయే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూసే అవకాశముంది.