English | Telugu
ఇండియాకి ఆస్కార్ వచ్చింది!
Updated : Mar 12, 2023
95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియా సత్తా చాటింది. కార్తికి గొన్సాల్వ్స్ దర్శకత్వంలో తమిళ్ లో రూపొందిన షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పర్స్' ఆస్కార్స్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పర్స్' విన్నర్ గా నిలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఫిల్మ్ 'ఆల్ దట్ బ్రీత్స్' నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకోలేకపోయింది. ఈ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అమెరికన్ ఫిల్మ్ 'నవాల్‌నీ' విన్నర్ గా నిలిచింది.