Read more!

English | Telugu

ఆస్కార్స్ 2023 విజేతల ఫుల్ లిస్ట్ ఇదే..

 

అశేష భారతీయుల కలను నిజం చేస్తూ ఎస్.ఎస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్‌'లోని "నాటు నాటు" సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డును సగర్వంగా అందుకుంది. ఆ పాటకు బాణీలు కూర్చిన ఎం.ఎం. కీరవాణి, ఆ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాలని చేతపట్టుకొని పులకించిపోయిన క్షణాలను వీక్షించిన వాళ్లెవరూ అంత త్వరగా మర్చిపోలేరు. దాని కంటే ముందు కార్తికి గాన్‌స్లేవ్స్ డైరెక్ట్ చేసిన తమిళ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫంట్ విస్పరర్స్' బెస్ట్ డాక్యుమెంటరీ సార్ట్ విభాగంలో అవార్డ్ గెలుచుకొని భారతీయ సినిమాను తలెత్తుకొనేలా చేసింది. నిజంగా ఒకే సారి రెండు భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు వచ్చిన క్షణాలు అపూర్వమైనవే కాదు, అపురూపమైనవి కూడా.

95వ అకాడెమీ అవార్డుల వేడుక అమెరికన్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి (మనకు సోమవారం వేకువ జామున) లాస్ ఏజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా మొదలయ్యింది. డేనియెల్ క్వాన్, డానియెల్ షైనర్ట్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్' టాప్ కేటగిరిల్లోని అత్యధిక అవార్డులను సొంతం చేసుకుంది. వాటిలో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టింగ్ అవార్డులు కూడా ఉన్నాయి. అదే సినిమాలో నటించిన మిషెల్లీ యే ఉత్తమనటిగా అవార్డును అందుకుని, ఆ గౌరవాన్ని పొందిన తొలి ఆసియా నటిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది. 'ది వేల్' మూవీలో నటించిన బ్రెండన్ ఫ్రేజర్ బెస్ట్ యాక్టర్‌గా తొలిసారి ఆస్కార్‌ను ముద్దాడాడు. 

ఆస్కార్ విజేతల పూర్తి జాబితా:
బెస్ట్ పిక్చర్: ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్ 
బెస్ట్ డైరెక్టర్: డెనియెల్ క్వాన్, డేనియెల్ షైనర్ట్ (ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్)
బెస్ట్ యాక్ట్రెస్: మిషెల్లీ యే (ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్)
బెస్ట్ యాక్టర్: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: జేమీ లీ కర్టిస్ (ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కే హుయ్ క్వాన్ (ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్)
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్ (డెనియెల్ క్వాన్, డేనియెల్ షైనర్ట్)
ఎడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: విమెన్ టాకింగ్ (సారా పొల్లీ)
ఎడిటింగ్: ఎవెరిథింగ్ ఎవెరివేర్ ఆల్ ఎట్ ఒన్స్ (పాల్ రోజర్స్)
ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్)
ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టెరన్ ఫ్రంట్ (వోకర్ బెర్తెల్‌మన్)
యానిమేటెడ్ షార్ట్: ద బాయ్, ద మేల్, ద ఫాక్స్ అండ్ ద హార్స్ (చార్లీ మాకెసీ, మాథ్యూ ఫ్రాయిడ్) 
కాస్ట్యూం డిజైన్: బ్లాక్ పాంథర్: వకాడా ఫరెవర్ (రూథ్ ఎ. కార్టర్)
మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్: ది వేల్ (ఆడ్రియెన్ మోరోట్, జూడీ చిన్, అన్నేమేరీ బ్రాడ్లీ) 
సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టెరన్ ఫ్రంట్ (జేమ్స్ ఫ్రెండ్)
లైవ్ యాక్షన్ షార్ట్: యాన్ ఐరిష్ గుడ్‌బై (టాం బెర్కెలీ, రాస్ వైట్)
విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (జో లెట్టెరి, రిచర్డ్ బనేహం, ఎరిక్ సైన్‌డాన్, డేనియెల్ బారెట్)
ఇంటర్నేషనల్ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టెరన్ ఫ్రంట్, జర్మనీ (ఎడ్వర్డ్ బెర్జర్)
సౌండ్: టాప్ గన్: మావెర్క్ (మార్క్ వైన్‌గార్టెన్, జేమ్స్ మాథెర్, అల్ నేసన్, క్రిస్ బర్డన్, మార్క్ టేలర్)
ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టెరన్ ఫ్రంట్ (క్రిస్టియన్ ఎం. గోల్డ్‌బెక్, ఎర్నెస్టైన్ హిప్పర్)
డాక్యుమెంటరీ ఫీచర్: నావల్నీ (డేనియల్ రోహర్, ఒడెస్సా రే, డయాన్ బెకర్, మెలానీ మిల్లర్, షేన్ బోరిస్)  
డాక్యుమెంటరీ షార్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ (కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్ మోంగా) 
యానిమేటెడ్ ఫీచర్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో)