English | Telugu

'గౌతమ్ నంద'ను గుర్తు చేస్తున్న 'దాస్ కా ధమ్కీ' కొత్త ట్రైలర్!

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్-1, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ ను విడుదల చేశారు.

రొమాన్స్, కామెడీ, యాక్షన్ కలగలిసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో విశ్వక్ సేన్ డాక్టర్ సంజయ్ రుద్రగా, వెయిటర్ గా రెండు విభిన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఎన్నో అవమానాలు పడుతూ, డబ్బుల్లేవని బాధపడుతున్న వెయిటర్.. డాక్టర్ స్థానంలోకి వెళ్లి అతనిలా నటించడం ట్రైలర్ లో చూడొచ్చు. అసలు ఆ డాక్టర్ కి ఏమైంది? అతని స్థానంలోకి వెయిటర్ ఎందుకు వెళ్ళాడు? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. మొత్తానికి ట్రైలర్ మాస్ ప్యాకేజ్ లా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో హీరో డ్యూయల్ రోల్, రిచ్ పర్సన్ ప్లేస్ లోకి పూర్ పర్సన్ వెళ్లడం, "డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోవద్దు" డైలాగ్ చూస్తుంటే ఇది గోపీచంద్ నటించిన 'గౌతమ్ నంద' సినిమా తరహాలో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కరాటే రాజు నిర్మాత. నివేథ పేతురాజ్ హీరోయిన్ కాగా రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.