English | Telugu
'సార్' ఓటీటీ క్లాసులకు ముహూర్తం కుదిరింది!
Updated : Mar 12, 2023
కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి). ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే సార్ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో మార్చి 17 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ 17 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా యువరాజ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.