English | Telugu

'ఛాంపియన్'గా శ్రీకాంత్ కుమారుడు

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ 'నిర్మలా కాన్వెంట్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత హీరోగా 'పెళ్లి సందడి' అనే సినిమా చేశాడు. ఇందులో అతని లుక్స్ కి, డ్యాన్స్ లకి మంచి మార్క్స్ పడ్డాయి కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే ఈసారి మాత్రం లెక్క సరి చేయాలని చూస్తున్నాడు.

వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్న 'ఛాంపియన్' సినిమాలో రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రోషన్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఇండియా మ్యాప్, రోషన్ కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఇది పీరియాడిక్ ఫిల్మ్ అనిపిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్వప్న సినిమా బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంతో రోషన్ సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.