English | Telugu
ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న సమంత స్పీచ్
Updated : Apr 9, 2023
సమంత రూత్ ప్రభు నటించిన శాకుంతలం సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ముంబైకి వెళ్లారు సమంత. అక్కడ ఆవిడ మాట్లాడిన హిందీకి ఫిదా అయ్యారు జనాలు. ముంబై ఈవెంట్ క్లిప్స్ ని ఇన్‌స్టాలో షేర్ చేశారు సమంత. ఆమె మాట్లాడిన తీరు ఫుల్ నేటివ్ స్పీకర్‌ని గుర్తుచేశాయని అంటున్నారు ఫ్యాన్స్. శాకుంతలం కే ట్రైలర్ కో అప్నే జైసే సపోర్ట్ కియే హే అవుర్ జో ప్యార్ దియా హే. ఉస్కే లియే బహుత్ షుక్రియా. ముఝే ఉమ్మీద్ హే కి ఆప్ ఐసీ తరా ముఝే అవుర్ శాకుంతలం ఫిల్మ్ కి టీమ్ కో అప్నే సపోర్ట్ దేన్‌గే అవుర్ ఫిల్మ్ సిర్ఫ్, సిర్ఫ్ థియేటర్స్ మే జాకే దేఖేన్‌గే (శాకుంతలం ట్రైలర్‌ని మీరందరూ ఆదరించిన తీరుకు ధన్యవాదాలు. శాకుంతలం టీమ్‌కి ఇలాంటి ఆదరణే అందిస్తారని ఆశిస్తున్నాం. థియేటర్లలోనే సినిమా చూస్తారని కోరుకుంటున్నాను) అని అన్నారు.
హిందీ ఫ్లూయన్సీ సూపర్బ్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. డిస్నిఫైడ్ కావడానికి సిద్ధంగా ఉండండంటూ శాకుంతలాన్ని డిస్నీ తరహా సినిమా అని వర్ణించారు సమంత. తనకు బాధ కలిగినా, సంతోషం కలిగినా డిస్నీ సినిమాలు చూస్తానని అన్నారు. పగలంతా షూటింగుల్లో స్టార్‌లాగా ఫీల్ అయినప్పటికీ, సాయంత్రం అయ్యేసరికి ఇంటికెళ్లి కుక్కల షిట్ తీసేయాల్సి వస్తోందని, తాను ప్యాన్ ఇండియా స్టార్‌ని అనే సంగతిని అవి పట్టించుకోవడం లేదని చమత్కరించారు సమంత.
శాకుంతలం సినిమాకు ముందు వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్‌సైజులు చాలా చేశానని, కానీ ఈ సినిమా చేస్తున్న క్రమంలో అలాంటివాటిని వదిలేశానని అన్నారు. అయితే వాటన్నిటికీ బదులు, ఈ సినిమా షూటింగ్ సమయంలో బంగారు నగలను మోశానని అన్నారు. ఈ సినిమాలో మునికన్యగా, మహారాణిగా రెండు పాత్రల్లో నటించారు సమంత రూత్ ప్రభు.