English | Telugu
అజిత్ తప్పేం లేదన్న నయన్ భర్త!
Updated : Apr 8, 2023
తన సినిమా మెటీరియలైజ్ కాకపోవడంలో అజిత్ తప్పేమీ లేదని అన్నారు నయనతార భర్త విఘ్నేష్ శివన్. ఈ ఏడాది సంక్రాంతికి తునివుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. ఈ సినిమా విడుదలైన వెంటనే, కొంచెం గ్యాప్ తీసుకుని ఏకే 62 సెట్స్ కి వెళ్లాలన్నది ఆయన ప్లాన్. అప్పుడే ఆ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి వీలవుతుందని అనుకున్నారు. తునివు రిలీజ్‌కి ముందే ఏకే 62 సినిమా విఘ్నేష్ శివన్‌తోనే అని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించడానికి లైకా సంస్థ కూడా ముందుకొచ్చింది. అయితే తునివు రిలీజ్ అయ్యాక ఫారిన్ ట్రిప్ వెళ్లారు అజిత్. ఆయన ట్రిప్ నుంచి ఎంతకీ రాకపోవడంతో విఘ్నేష్ శివన్ సినిమా ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీని గురించి ఎవరూ స్పందించలేదు. కాకపోతే విఘ్నేష్ శివన తన సోషల్ మీడియా ఖాతాల్లో ఏకే 62ని రిమూవ్ చేశారు. దీంతో అజిత్ సినిమాకు విఘ్నేష్ పనిచేయట్లేదనే వార్త వైరల్ అయింది. సరిగ్గా అప్పుడే మగిళ్ తిరుమేని సీన్‌లోకి వచ్చారు. ఆయన చెప్పిన కథ అజిత్‌కి నచ్చిందని, విఘ్నేష్ కథను అజిత్ వద్దన్నారని వార్తలొచ్చాయి.
అజిత్ తనతో వీడియో కాల్ మాట్లాడుతున్న పిక్‌ని పోస్ట్ చేశారు విఘ్నేష్. తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సమ్‌థింగ్ ఫిష్షీ అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ ఇష్యూ గురించి మాట్లాడారు విఘ్నేష్ శివన్. ``నేను ఏకే 62 నుంచి తప్పుకోవడంలో అజిత్‌గారి తప్పు లేదు. నా కథ అజిత్‌గారికి నచ్చింది. కానీ ప్రొడక్షన్ హౌస్‌కి నచ్చలేదు. వాళ్లు సెకండ్ హాఫ్ మార్చమన్నారు. ఛాన్స్ మిస్ అయినందుకు నాకు చాలా బాధ కలిగింది. అయితే, ఈ సినిమా మగిళ్ తిరుమేని లాంటి మంచి దర్శకుడి చేతిలో పడినందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు. ఇటీవల నయనతార - విఘ్నేష్ శివన్ దేవుడిని దర్శించుకోవడం కోసం కుంభకోణం వెళ్లారు. అక్కడ విఘ్నేష్ శివన్ కులదైవానికి పూజలు చేశారు.