English | Telugu
ఘనంగా విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం!
Updated : Apr 26, 2023
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన 11వ సినిమాని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'VS11' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుధవారం ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో 'VS11' మూవీ లాంచ్ ఘనంగా జరిగింది. ముహూర్తపు షాట్ కి సుధారాకర్ చెరుకూరి కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ కొట్టారు మొదటి షాట్ కి వెంకట్ బోయనపల్లి దర్శకత్వం వహించారు. వెంకీ అట్లూరి, రామ్ ఆచంట తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందజేశారు. నిర్మాతలు గోపీ ఆచంట, సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకులు మల్లిక్ రామ్, శ్రీకాంత్ ఎన్ రెడ్డి, కళ్యాణ్ శంకర్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
90వ దశకంలో రాజమండ్రి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. మే నుండి VS11 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.