English | Telugu
'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!
Updated : Apr 26, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇదిలా ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
'ఉస్తాద్ భగత్ సింగ్'ని పక్కా ప్లానింగ్ తో వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయిందో లేదో, అప్పుడే ఎడిటింగ్ వర్క్ కూడా మొదలైంది. బ్లాక్ బస్టర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, ఎడిటింగ్ వర్క్ ని ప్రారంభించామని తెలుపుతూ మేకర్స్ ఫోటోలను వదిలారు. అందులో దర్శకనిర్మాతలు పూజ చేస్తూ కనిపించారు. అతి త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని మేకర్స్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్-హరీష్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 2012, మే 11న విడుదలైంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మే 11న ఉస్తాద్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.