English | Telugu
అన్న సెల్వరాఘవన్‌తో చేతులు కలుపుతున్న ధనుష్
Updated : Jul 12, 2023
ధనుష్ హీరోగా నటిస్తున్న డీ 50 సినిమాకు రోజు రోజుకి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ సినిమాలో ధనుష్ కేవలం హీరోగా మాత్రమే నటించట్లేదు. ఆయన దర్శకత్వం కూడా వహించనున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీలో తన సోదరుడు సెల్వరాఘవన్ కి కూడా ధనుష్ ఛాన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇప్పటిదాకా సెల్వరాఘవన్ దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించారు ధనుష్. అయితే తొలిసారి తన సోదరుడికి తన డైరక్షన్‌లో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. అన్నదమ్ముల వృత్తిపరంగా తొలిసారి రోల్స్ రివర్స్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా నానే వరువేన్ 2022లో విడుదలైంది. నానే వరువేన్ ఆడియన్స్ నుంచి మోస్తరు స్పందన రాబట్టగలిగింది. అందులో ధనుష్ డబల్ రోల్ లో నటించారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి మయక్కం ఎన్న, పుదుప్పేట్టై, కాదల్ కొండేన్‌కి పనిచేశారు.
డి ఫిఫ్టీ అనేది ధనుష్ సినిమాకు టెన్టేటివ్ టైటిలే. ఇంతకుముందు 2017లో పా పాండి అనే సినిమాకు డైరెక్ట్ చేశారు ధనుష్. అందులో ఆయన తన ఒరిజినల్ లైఫ్ క్యారెక్టర్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు డీ50లో డిఫరెంట్ గా కనిపించనున్నారు ధనుష్. ఈ సినిమా కామెడీ డ్రామా అనే మాట ఉన్నప్పటికీ, గ్యాంగ్‌స్టర్ డ్రామా గానే ఎక్కువగా ప్రచారం పొందుతోంది. ఇందులో ధనుష్ గుండు గీయించుకొని ఓ రోల్‌లో కనిపిస్తారనే మాట కూడా వైరల్ అవుతుంది. ఇటీవల తిరుపతిలో గుండుతోనే దర్శనం ఇచ్చారు ధనుష్.