English | Telugu
రెండో పెళ్ళికి రెడీ అయిన స్టార్ డాటర్!
Updated : Jul 11, 2023
కోలీవుడ్ స్టార్ ధనుష్, అతని భార్య ఐశ్వర్య రజినీకాంత్ గతేడాది జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఏకంగా 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యకరమైన న్యూస్ వినిపిస్తోంది. కోలీవుడ్ కి చెందిన ఓ హీరోని ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టార్ డాటర్ గా, స్టార్ వైఫ్ గానే కాకుండా దర్శకురాలిగానూ ఐశ్వర్య తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. '3' సినిమాతో దర్శకురాలిగా మారి ఆకట్టుకున్నారు ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో 'లాల్ సలామ్' చిత్రం రూపొందుతోంది. ఇలా ఓ వైపు దర్శకత్వం, మరోవైపు పిల్లల బాధ్యత చూసుకుంటున్న ఐశ్వర్య గురించి ఇప్పుడు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆమె తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో సన్నిహితంగా ఉంటుందని, త్వరలోనే అతన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.