ఆహాలో 'సామజవరగమన' సందడి!
పెద్దగా అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సామజవరగమన' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 29 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.