English | Telugu

మెహర్ రమేష్ జాతకం చెప్పిన హైపర్ ఆది


చిరంజీవి నటించి "భోళా శంకర్" మూవీకి సంబంధించిన ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది డైరెక్టర్ మెహర్ రమేష్ ని ఆకాశానికి ఎత్తేసారు. ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ సెకండ్ సింగిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది...ఇందులో హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో రెండే రెండు ఫేమస్.. ఒకటి భోళాశంకర్ మేనియా.. రెండు సురేష్ కొండేటి మేనియా. భోళా శంకర్ సినిమాలో ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ ఈ మూవీకి ఎంత ప్రత్యేకమో నాకు అంతే ప్రత్యేకం. ఎందుకంటే ఈ సాంగ్ షూట్ రోజు నా బర్త్ డే. ఆరోజు చిరంజీవి గారి సమక్షంలో నా బర్త్ డే జరిగింది. చాలామంది ఈ షూటింగ్ టైంలో ఉన్నారు. ఈ సాంగ్‌లో ఎంత సెలబ్రేషన్ ఉంటుందో .. ఆగష్టు 11న థియేటర్స్‌లో ప్రతి సీన్‌కి అంతే సెలబ్రేషన్ ఉంటుంది. భోళా శంకర్ అంత పెద్ద హిట్ అవ్వబోతుంది అంటే గ్యాంగ్ లీడర్ లో చిరుగారి ఆటిట్యూడ్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కామెడీ టైమింగ్, ఇంద్రలో డాన్స్, హిట్లర్ లో సెంటిమెంట్ ఎంత బాగుంటుందో ..ఇప్పుడు భోళా శంకర్ అంతే బాగుండబోతోంది. ఈసారి మెగాస్టార్ చెప్పారు మీకు ఏం కావాలో అవి తీసుకోమని ...అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో.

మెహర్ రమేష్ గారు అనగానే.. సోషల్ మీడియాలో శక్తి సినిమా.. షాడో సినిమా ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్లకి చెప్తున్న .. ఇండియాకి పేరు తెచ్చిన బాహుబలి ప్రభాస్ గారి కెరియర్‌లో స్టైలిష్ సినిమా ఒక్కటి చెప్పమంటే బిల్లా సినిమా చెప్తాం... ఆ సినిమాని డైరెక్ట్ చేసింది మెహర్ రమేష్ గారే. పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేరు.. ఆయన సినిమాల్లో బెస్ట్ మూవీ అంటే.. వీరకన్నెడిగ అని అంటారు. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది మన మెహర్ రమేష్ గారే. ఫెయిల్యూర్స్ కి ట్రోలింగ్‌కి కారణం ఐతే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ ట్రోల్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ లేని వారు ఉండరు .

ప్రతి ఒక్కరికీ ఓ టైం వస్తుంది ఇప్పటికీ మనం భోజనం చేసేటప్పుడు ఢీ, రెఢీ, దూకుడు, వెంకీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లాంటి సినిమాలు చూసి కామెడీ చూసి నవ్వుకుంటాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమాలు తీసిన శ్రీను వైట్ల గారు.. సినిమా తీసి చాలా రోజులైంది. ఒక్కోసారి టైం అంతే కానీ ఆయన ఎప్పుడూ గొప్ప డైరెక్టరే. ఆయన స్థాయిని మనం తగ్గించి మాట్లాడకూడదు. కమ్ బ్యాక్ ఇవ్వడానికి టైం పట్టొచ్చు కానీ.. కానీ ఆ కమ్ బ్యాక్ చాలా స్ట్రాంగ్‌ ఉంటుంది. మెహర్ రమేష్ విషయంలో ఏ ట్రోల్స్ అయితే వచ్చాయో అవే ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి.. ఈ ‘భోళా శంకర్’ పెద్ద హిట్ కాబోతుంది’ అంటూ విషెస్ చెప్పాడు ఆది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.