English | Telugu
పవన్ కళ్యాణ్ బ్రో.. మరీ ఇంత తక్కువా!
Updated : Jul 13, 2023
'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి వరుస విజయాల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా 'బ్రో'. ఇందులో 'సుప్రీమ్' హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా.. పవన్ స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. 'వినోదయ సితమ్' అనే తమిళ చిత్రం ఆధారంగా 'బ్రో' రూపొందింది. మాతృకని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కొన్ని మార్పు చేర్పులతో తెరకెక్కించారు. ఈ నెల 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. కేవలం 130 నిమిషాలు (2 గంటల 10 నిమిషాలు) నిడివితో ఈ సినిమా సాగుతుందట. అంతేకాదు.. చిత్రం ప్రారంభమైన 20 నిమిషాల తరువాతే పవన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. ఏదేమైనా.. ఇటీవల కాలంలో పవన్ సినిమాల్లో ఇదే తక్కువ డ్యూరేషన్ ఉన్న ఫిల్మ్ అని చెప్పాలి. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
తమన్ సంగీతమందించిన 'బ్రో'లో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నాయికలుగా దర్శనమివ్వనుండగా.. ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది.