English | Telugu
సమంతతో విజయ్ కెమిస్ట్రీ మాములుగా లేదసలు.. 'ఖుషి' సెకండ్ సింగిల్ 'ఆరాధ్య' రివ్యూ
Updated : Jul 12, 2023
"నా రోజా నువ్వే.." అంటూ రెండు నెలల క్రితం ఫస్ట్ సింగిల్ తో మ్యూజిక్ లవర్స్ ని ఫుల్ ఖుష్ చేసేసిన 'ఖుషి' టీమ్.. ఇప్పుడు 'ఆరాధ్య' అంటూ సెకండ్ సింగిల్ తో పలకరించింది. విజయ్ దేవరకొండ, సమంతపై చిత్రీకరించిన ఈ పాట కూడా మెలోడీయస్ గా సాగింది. చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యమందించిన ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహబ్ అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సిద్ శ్రీరామ్, చిన్మయి గాత్రాలైతే పాటని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. లిరికల్ వీడియోని బట్టి చూస్తే.. సమంతతో విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ మాములుగా లేదనే చెప్పాలి.
"ఆరాధ్య నా ఆరాధ్య.. నువ్వేలేనిదేది వద్దు ఆరాధ్య" అంటూ సాగే ఈ పాటలో "నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే" వంటి వాక్యాలు భలేగా వర్కవుట్ అయ్యాయి. ఓవరాల్ గా.. 'ఖుషి" నుంచి వచ్చిన తొలి రెండు గీతాలు కూడా చార్ట్ బస్టర్స్ అనే చెప్పొచ్చు. మరి.. మ్యూజికల్ గా మెస్మరైజ్ చేస్తున్న 'ఖుషి' నుంచి తదుపరి రాబోయే పాటలు కూడా ఇదే స్థాయిలో ఆకట్టుకుంటాయేమో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తయారవుతున్న 'ఖుషి'.. సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి రానుంది.