English | Telugu
అప్పుడే ఓటీటీలోకి 'సామజవరగమన'!
Updated : Jul 12, 2023
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం 'సామజవరగమన'. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 29 విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పటిదాకా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా నాలుగు వారాలు కూడా తిరగకుండానే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
'సామజవరగమన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ముందే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం, జూలై 22న లేదా జూలై 25న స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే థియేటర్స్ లో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలో అలరించనుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.