English | Telugu

'జైల‌ర్‌' ప్రీ రిలీజ్.. ఒకే వేదిక‌పై ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `జైల‌ర్‌`. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగ‌స్ట్ 10న ఈ చిత్రం తమిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ్ కావ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు బాక్సాఫీస్ వ‌ర్గాలు సైతం జైల‌ర్ రిలీజ్ క‌లెక్ష‌న్స్ ఏ మేర‌కు ఉండొచ్చున‌నే దానిపై డిస్క‌ష‌న్స్ ఇప్ప‌టికే స్టార్ట్ చేశాయి.

వ‌డివేలు చుట్టూ క‌మ‌ల్ రాజ‌కీయం!

కోలీవుడ్ స్టార్ కమెడియ‌న్స్‌లో వ‌డివేలు శ‌కాన్ని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఒక‌ప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిన ఈయ‌న మ‌ధ్య‌లో కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరంటూ ఉంటూ వ‌చ్చారు. అయితే ఈమ‌ధ్య మ‌ళ్లీ ఆయ‌న సినిమాల్లో దూకుడుని పెంచారు. ఈ ఏడాది ఉద‌య‌నిధి స్టాలిన్‌తో క‌లిసి వ‌డివేలు న‌టించిన చిత్రం `మామ‌న్న‌న్` (తెలుగులో `నాయ‌కుడు`) మంచి విజ‌యాన్ని సాధించింది. మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ మూవీలో వ‌డివేలు చాలా సీరియ‌స్ పాత్ర‌లో న‌టించారు. అది కూడా ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా. `మామ‌న్నన్` మూవీలో వ‌డివేలు వెనుక‌బ‌డిన వ‌ర్గానికి చెందిన రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించారు.

స‌మంత రూ.12కోట్లు పోగొట్టుకున్నారా?

స‌మంత గురించి రోజుకో వార్త వైర‌ల్ అవుతోంది. ఆమె ఇప్పుడు కెరీర్‌కి ఆరు నెల‌ల‌పాటు బ్రేక్ ఇచ్చారు. ఆమె ప్ర‌స్తుతం చేతిలో ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత విశ్రాంతి తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్న విష‌యాల‌కు సంబంధించిన వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తున్నారు. ఆరోగ్యం, విశ్రాంతి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ, ఈ ఆరు నెల‌ల బ్రేక్ వ‌ల్ల స‌మంత ఎంత పోగొట్టుకుంటున్నారోన‌ని లెక్క‌లేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ప్ర‌స్తుతం కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాల‌ని డిసైడ్ అయిన స‌మంత‌, ఆల్రెడీ ఒప్పుకున్న హాలీవుడ్ ప్రాజెక్ట్ అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేశారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌లో ఏ సినిమాలూ చేయ‌డం లేదు. వీట‌న్నిటివ‌ల్ల ఆమె దాదాపు 12 కోట్లు న‌ష్ట‌పోతున్నార‌న్న‌ది టాక్‌.

సూర్య కోసం రంగంలోకి లేడీ డైరెక్ట‌ర్‌..!

వైవిధ్యమైన సినిమాలు, పాత్రల‌తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ద‌క్కించుకున్న హీరోల్లో కోలీవుడ్ హీరో సూర్య ఒక‌రు. న‌చ్చిన సినిమాలోనూ త‌న పాత్ర కోసం ఆయ‌న రిస్క్ చేయ‌టానికి వెనుకాడ‌రు. వ‌రుస సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే సూర్య 42వ చిత్రంగా `కంగువా` సినిమాను చేస్తున్నారు. మ‌రో వైపు వెట్రిమార‌న్‌తో `వాడివాస‌ల్` చిత్రం చేయ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయితే వెట్రి మార‌న్ మూవీ చేయ‌టం కంటే ముందే లేడీ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను కంప్లీట్ చేయ‌టానికి సూర్య రెడీ అయిపోయారు. ఇప్ప‌టికే ఆమె సూర్య ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు ఓ క‌థ‌ను సిద్ధం చేసేస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. సూర్య 43వ మూవీగా ఇది రూపొంద‌నుంది.  

ధ‌నుష్ డ‌బుల్ ధ‌మాకా

వెర్స‌టైల్ యాక్ట‌ర్ ధ‌నుష్.. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాతో పాటు త‌న 50 సినిమాను కూడా చేయ‌టానికి రెడీ అయ్యారు. కెప్టెన్ మిల్ల‌ర్ సినిమాను చూస్తే పీరియాడిక్ మూవీలా అనిపిస్తుంది. ఇక త‌న 50వ మూవీని ధ‌నుష్ ఇంకా షురూ చేయ‌లేదు. అయితే ఆ సినిమాలో న‌టిస్తోన్న ఎస్‌.జె.సూర్య‌, సందీప్ కిష‌న్‌ల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ధ‌నుష్ కూడా సెట్స్‌లోకి అడుగు పెట్ట‌బోతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సాలిడ్ అప్‌డేట్స్ రాలేదు. మ‌రో వైపు ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ధ‌నుష్ సినిమాలకు సంబంధించిన వివ‌రాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు... ధ‌నుష్ ఏకంగా డ‌బుల్ ధ‌మాకాను సిద్ధం చేస్తున్నారు.