English | Telugu
రెడీ అవుతున్న కంగువ టీజర్
Updated : Jul 15, 2023
కేరక్టర్ కోసం అహర్నిశలు కష్టపడే హీరోల్లో సూర్య ఒకరు. తమిళంలో కమల్, విక్రమ్ తర్వాత ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేస్తుంటారు సూర్య. కేరక్టర్ డిమాండ్ చేస్తే, ఎలాంటి ఎక్స్ పెరిమెంట్ చేయడానికైనా ఆయన వెనకాడరు. ఆయన డెడికేషన్ చూసి చాలా సందర్భాల్లో మేకర్స్, కో ఆర్టిస్ట్స్ వండర్ అవుతుంటారు. ఎవర్‌గ్రీన్ హీరో సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం విపరీతంగా కష్టపడుతున్నారు సూర్య. ఈ ప్రాజెక్ట్ చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 10 భాషల్లో విడుదల కానున్న 'కంగువ'లో సూర్య 10 విభిన్న పాత్రలు పోషించినట్లు సమాచారం. సూర్య కెరీర్‌లో ఇది అత్యంత ఖరీదైన చిత్రం అని ట్రెండ్ అవుతోంది. ఈ నెల 23న సూర్య 48వ ఏట అడుగుపెడుతున్నారు.
పుట్టినరోజు సందర్భంగా సూర్య తన ప్రియమైన అభిమానులకు పుట్టినరోజు కానుకను రెడీ చేస్తున్నారు. జూలై 23న ‘కంగువ’ టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అభిమానులకు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు, పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసే క్లిప్‌ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది కంగువ టీమ్. దీనికోసం దర్శకుడు సిరుత్తై శివ, అతని టీమ్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'కంగువ' చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య , దిశా పటాని జంటగా నటించారు. ప్రధాన పాత్రలలో యోగి బాబు, రెడిన్ కింగ్‌స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, కె.ఎస్. రవికుమార్ నటించారు.