'బ్రో' సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో వింటేజ్ పవర్ స్టార్ ని చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అయితే ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ రూపంలో వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.