English | Telugu
సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన సమంత
Updated : Jul 24, 2023
తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన ఇమేజ్ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌లను ఫ్యాన్స్, నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ సహా అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. అందుకు కారణం.. ఆమె తన హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింది. మొన్నటి వరకు పొడవైన జుట్టుతో కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం హెయిర్‌ను కట్ చేయించుకుంది. తన కొత్త లుక్‌తో ఉన్నప్పటి వీడియోను పోస్ట్ చేయగా అందరరూ ఆశ్చర్యపోయారు. కొందరు నెటిజన్స్ ఆమె పాత లుక్‌లోనే బావుందని అంటుంటే కొందరు మాత్రం కొత్త లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నావని అంటున్నారు.
సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న సమంత ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంది. తనకు నచ్చిన ప్రదేశాలకు స్నేహితులతో కలిసి టూర్‌కి వెళుతుంది. తాజాగా తన వెకేషన్‌లో ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి చేస్తోన్న ఖుషి సినిమాకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేసింది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్‌ను కూడా పూర్తి చేసింది. అయితే తదుపరి సినిమాలను ఆమె సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ఏడాది పాటు సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ తీసుకుంటున్నానని ప్రకటన చేసింది.
అందులో భాగంగానే ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన. టూర్స్ వెళ్లటం వంటి పనులను చేస్తోంది. కొన్నాళ్లు ముందు సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. నడవటం కూడా కష్టమవుతుందేమోనని ఆమె బాధను వ్యక్తం చేసింది. అయితే డాక్టర్స్ సపోర్ట్, వ్యాయామంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకుని షూటింగ్స్‌ను పూర్తి చేసింది. తదుపరి చేయాల్సిన సినిమాలకు సంబంధించి ఆమె దూరంగా జరిగింది. నెక్స్ మళ్లీ ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.