English | Telugu
60 కోట్ల క్లబ్ లో 'బేబీ'.. ఇదెక్కడి క్రేజ్ రా మావ!
Updated : Jul 24, 2023
'బేబీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. పది రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బేబీ జోరు చూస్తుంటే త్వరలోనే రూ.70 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది.
ఈమధ్య పెద్ద సినిమాలే రెండో వారాంతానికి చతికిలపడుతున్నాయి. అలాంటిది చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ' మాత్రం రెండో వారాంతంలోనూ మొదటి వారాంతం స్థాయిలో వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. మొదటి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.3.77 కోట్ల షేర్ రాబట్టిన బేబీ, పదో రోజైన రెండో ఆదివారం కూడా రూ.3.40 కోట్ల షేర్ రాబట్టిందంటే ప్రేక్షకులు ఏస్థాయిలో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటిదాకా బేబీ సినిమా నైజాంలో రూ.12.06 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.4.08 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.11.71 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి పది రోజుల్లో రూ.27.85 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.48 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.2.38 కోట్ల షేర్ వసూలు చేసిన బేబీ.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.31.71 కోట్ల షేర్(60.40 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది.
జూలై 28న 'బ్రో' విడుదలయ్యే వరకు 'బేబీ' బాక్సాఫీస్ జోరు కొనసాగే అవకాశముంది. ఈ లెక్కన ఫుల్ రన్ లో రూ.70 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.