English | Telugu
విజయ్‌కి చెల్లెలిగా నటించను: వనితా విజయ్ కుమార్
Updated : Jul 24, 2023
కోలీవుడ్ నటీనటుల్లో నిత్యం వార్తల్లో ఉంటూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న నటి వనితా విజయ్ కుమార్. ఈమె మూడు పెళ్లిళ్లతో న్యూస్‌లో నిలిచింది. సమస్య పెళ్లి చేసుకోవటం కాదు.. తర్వాత వచ్చిన సమస్యలు వాటిపై వనితా విజయ్ కుమార్ స్పందించిన తీరుతో ఆమెపై మీడియా ఫోకస్ ఎక్కువైంది. అదే సమయంలో ఆమెకు బిగ్ బాస్ తమిళ్ మరింత గుర్తింపు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఈ విషయంపై రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ కారణంగా రెండేళ్లలో 17 సినిమాల్లో నటించానని చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అదే సమయంలో మీరు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి చెల్లెలుగా నటిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె మాట్లాడుతూ `విజయ్‌కి చెల్లెలుగా నటిస్తే సూట్ కాను` అని నిర్మొహమాటంగా ఆమె చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా అర్జున్ దాస్, దుసరా విజయన్ నటించిన అనీది (తెలుగులో బ్లడ్ అండ్ చాక్లెట్) చిత్రంలోనూ వనితా విజయ్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం ఆమె తెలుగులో మరీ నిర్మాతలతో గొడవపడి మీర డబ్బింగ్ చెప్పింది. తమిళంలో విడుదలైన ఈ మూవీ తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు.
కోలీవుడ్ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కుమార్తెగా వనితా విజయ్ కుమార్ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. రుక్మిణి, దేవి వంటి చిత్రాలతో మంచి గుర్తింపునే సంపాదించుకుంది. కానీ ఎందుకనో ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో ఆమె పోటీ ప్రపంచంలో వెనుకపడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ నటిగా దూసుకెళ్తున్నారు.