English | Telugu
'ఇంద్రసేనారెడ్డి'లా మారిన 'భోళా శంకర్'
Updated : Jul 23, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చింది.
'భోళా శంకర్' ట్రైలర్ ను జూలై 27న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మెగాస్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, ఇంటెన్స్ లుక్ 'ఇంద్ర' సినిమాలోని ఆయన లుక్ ని తలపిస్తున్నాయి. దీంతో ఇంద్ర రోజులు గుర్తుకొచ్చాయి అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కూడా ఇంద్ర తరహాలోనే రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్, 'భోళా శంకర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.