English | Telugu

'బ్రో' సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో వింటేజ్ పవర్ స్టార్ ని చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అయితే ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ రూపంలో వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.

'బ్రో' సినిమా కుటుంబమంతా చూడదగ్గ ఫీల్ గుడ్ ఫిల్మ్ అని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. అందుకుతగ్గట్టుగానే బ్రో చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా నిడివి కూడా 134 నిమిషాలే. అంటే 2 గంటల 15 నిమిషాల లోపే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఏమాత్రం పండినా.. ఈ తక్కువ నిడివి, సినిమాకి మరింత లాభం చేకూర్చే అవకాశముంది. పైగా సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు సమాచారం. 'వకీల్‌ సాబ్', 'భీమ్లా నాయక్‌' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.