English | Telugu

లాస్ ఏంజెల్స్‌లో ఇండియ‌న్‌2 మూవీ!

లాస్ ఏంజెల్స్‌లో ఇండియ‌న్‌2 సినిమా వ‌ర్క్ జ‌ర‌గ‌నుంది. ఈ వ‌ర్క్ గురించి డైర‌క్ట‌ర్ శంక‌ర్ అప్‌డేట్ ఇచ్చారు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టించిన సినిమా ఇండియ‌న్‌. శంక‌ర డైర‌క్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇండియ‌న్‌2 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. 2024 వేస‌విలో ఈ సినిమాను విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సినిమా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ అన్నీ స‌క్ర‌మంగా జ‌రిగి ఉంటే ఎప్పుడో సినిమా విడుద‌ల కావాల్సింది. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు ఏవో అవాంత‌రాలు రావ‌డంతో ప్రాజెక్ట్ ప‌క్క‌న‌ప‌డింది. అయితే విక్ర‌మ్ సినిమా స‌క్సెస్ త‌ర్వాత కమ‌ల్‌హాస‌న్ వాంటెడ్‌గా ఈ సినిమా మీద ఫోక‌స్ చేశారు. ఎలాగైనా, సినిమాను పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ క‌మిట్‌మెంట్ చూసి శంక‌ర్ కూడా ఇండియ‌న్‌2 కోసం ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు. ఆల్రెడీ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా గేమ్ చేంజ‌ర్ మూవీ చేస్తున్నారు శంక‌ర్‌. అయినప్ప‌టికీ, లోక‌నాయ‌కుడికి రెస్పెక్ట్ ఇచ్చి, రెండు సినిమాల‌ను బ్యాల‌న్స్ చేస్తూ డైర‌క్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న టాప్ డైరక్ట‌ర్ల‌లో ఒకే సారి రెండు సినిమాల‌ను బ్యాల‌న్స్ చేస్తున్న డైర‌క్ట‌ర్ శంక‌ర్ మాత్ర‌మే.

ఇండియ‌న్‌2 సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నారు శంక‌ర్‌. ``లోలా వీఎఫ్ ఎక్స్ కంపెనీలో అడ్వాన్స్డ్ టెక్నాల‌జీని స్కాన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇండియ‌న్‌2 కోసం అంటూ ఆయ‌న పెట్టిన పిక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. లోలా కంపెనీలో ముఖ్యంగా క‌మ‌ల్‌హాస‌న్ డీ ఏజింగ్ ప్రాసెస్ చేయిస్తార‌ని టాక్‌. లోలా వీఎఫ్ఎక్స్ కి డీ ఏజింగ్ టెక్నాల‌జీ మీద మంచి గ్రిప్ ఉంది. ది ఐరిష్‌మేన్‌, ఎవెంజెర్స్: ఎండ్ గేమ్ సినిమాల‌కు ప‌నిచేసింది ఈ కంపెనీ. క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విక్ర‌మ్ సినిమాలోనూ ఈ టెక్నాల‌జీని వాడాల‌నుకున్నారు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. కానీ ఈ ప్రాసెస్‌కి అత్య‌ధిక స‌మ‌యం ప‌డుతుంది. పైగా మితిమీరిన వ్య‌యంతో కూడుకున్న విష‌యం. అందుకే లాస్ట్ మినిట్‌లో వ‌ద్ద‌నుకున్నారు లోకేష్‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.