English | Telugu
డైరెక్టర్‌ని మార్చేస్తున్న నాగ్!
Updated : Aug 4, 2023
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆయన నెక్ట్స్ సినిమా ఏం చేయబోతున్నారా? అనే దానిపై అభిమానులు సహా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఆయన సినిమా వచ్చి చాలా రోజులే అయ్యింది. అయితే అయ్యింది కానీ.. కొత్త సినిమా ఏంటనే దానిపై అధికారిక సమచారం లేదు. ఇదే ఆయన అభిమానులను కాస్త ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్య ఆయన రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారనే దానిపై బలమైన వార్తలు బయటకు వచ్చాయి. మలయాళ చిత్రం ‘పోరింజు మరియమ్ జోస్’ సినిమా రీమేక్‌లో నటించటానికి నాగార్జున ఆసక్తిగా ఉన్నారు. ముందుగా ఈ సినిమాను ప్రసన్నకుమార్ డైరెక్ట్ చేస్తారన్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు సినిమా హోల్డ్‌లో పడింది.
ఇప్పుడు నాగార్జున మళ్లీ తను చేయాలనుకున్న రీమేక్‌ను ట్రాక్ ఎక్కించటానికి రెడీ అయ్యారు. అయితే దీనికి ప్రసన్నకుమార్ రైటర్‌గానే వ్యవహరిస్తారు. కానీ దర్శకుడు మారుతున్నారని సమాచారం. యంగ్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ‘పోరింజు మరియమ్ జోస్’ రీమేక్‌తో డైరెక్టర్‌గా మారబోతున్నారట. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. శ్రీనివాస చిట్టూరి సినిమాను నిర్మిస్తారంటున్నాయి మీడియా వర్గాలు.
మరో వైపు నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ను హోస్ట్ చేయటానికి రెడీ అయిపోతున్నారు. త్వరలోనే ఈ షో కూడా స్టార్ట్ అవుతుంది. ది ఘోస్ట్ వంటి పక్కా యాక్షన్ మూవీలో నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో నాగ్ కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు ‘పోరింజు మరియమ్ జోస్’ను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.