English | Telugu
'బేబీ' మూడు వారాల కలెక్షన్స్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ బొమ్మ!
Updated : Aug 4, 2023
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ రూపొందించిన సినిమా 'బేబీ'. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాని శ్రీనివాస కుమార్ నాయుడు (ఎస్కేన్) నిర్మించారు. విజయ్ బుల్గనిన్ బాణీలు కట్టాడు. జూలై 14న జనం ముందు నిలిచిన 'బేబీ'.. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించింది.
కాగా, గురువారం (ఆగస్టు 3)తో మూడు వారాల (21 రోజులు) ప్రదర్శన పూర్తిచేసుకున్న 'బేబీ'.. 21వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల గ్రాస్, 24 లక్షల షేర్ ఆర్జించింది. ఓవరాల్ గా.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు వారాల (21 రోజుల)కి గానూ రూ. 35.39 కోట్ల షేర్ (రూ. 64.05 గ్రాస్) రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 40. 72 కోట్ల షేర్ (రూ. 76. 45 కోట్ల గ్రాస్) ఆర్జించింది.
తొలి రోజు నుంచి 21వ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో 'బేబీ' కలెక్షన్ వివరాలు:
మొదటి రోజు: 2.60 కోట్ల షేర్
రెండో రోజు: 2.98 కోట్ల షేర్
మూడో రోజు: 3.77 కోట్ల షేర్
నాలుగో రోజు: 3.72 కోట్ల షేర్
ఐదో రోజు: 2.94 కోట్ల షేర్
ఆరో రోజు: 2.45 కోట్ల షేర్
ఏడో రోజు: 2.00 కోట్ల షేర్
ఎనిమిదో రోజు : 1.76 కోట్ల షేర్
తొమ్మిదో రోజు: 2.33 కోట్ల షేర్
పదో రోజు: 3.40 కోట్ల షేర్
పదకొండో రోజు: 1.46 కోట్ల షేర్
పన్నెండో రోజు: 1.21 కోట్ల షేర్
పదమూడో రోజు: 90 లక్షలషేర్
పద్నాలుగో రోజు: 82 లక్షలషేర్
పదిహేనో రోజు : 47 లక్షలషేర్
పదహారో రోజు: 65 లక్షలషేర్
పదిహేడో రోజు : 71 లక్షలషేర్
పద్దెనిమిదో రోజు : 44 లక్షలషేర్
పంతొమ్మిదో రోజు : 34 లక్షలషేర్
ఇరవైవ రోజు: 30 లక్షలషేర్
21వ రోజు: 24 లక్షలషేర్
21 రోజులమొత్తం షేర్: రూ. 35.39 కోట్ల షేర్