English | Telugu
జైలర్ డైరక్టర్‌తో శింబు
Updated : Aug 3, 2023
నయనతార నటించిన కోలమావు కోకిల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నెల్సన్ దిలీప్‌కుమార్. 2018లో విడుదలైన ఈ సినిమా చాలా మంచి హిట్ అయింది. డైరక్టర్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్‌కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో ఆయన పనితనం చూసి శివకార్తికేయన్ డాక్టర్ స్క్రిప్ట్ కి ఓకే చెప్పారు. ఆ సినిమా ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. డిఫరెంట్ కాన్సెప్టులతో బాక్సాఫీస్‌కి బూస్ట్ ఇస్తున్నారు నెల్సన్ అనే పేరు వచ్చింది. ఆ వెంటనే విజయ్ పిలిచి బీస్ట్ అవకాశం ఇచ్చారు. అయితే బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర డీలా పడింది. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో నెల్సన్ తడబడ్డారనే పేరు వచ్చింది. ఇదే విషయాన్ని రజనీకాంత్‌తోనూ చాలా మంది చెప్పారట. డిస్ట్రిబ్యూటర్లైతే నెల్సన్‌తో సినిమా అసలు వద్దని మొత్తుకున్నారట. అయినా సన్ పిక్చర్స్ వాళ్లు ముందుకు వెళ్లమన్నారు. రజనీకాంత్ సినిమా చేశారు. అలా జైలర్ సెట్స్ మీదకు వెళ్లింది. ఈ నెల 10న విడుదల కానుంది జైలర్ సినిమా.
ఈ చిత్రం తర్వాత శింబుతో సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. శింబు హీరోగా 2013లోనే సినిమా చేయాల్సింది నెల్సన్ దిలీప్‌కుమార్. అప్పట్లో సగానికి పైగా చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేశారు. ఇప్పుడు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద ధనుష్ హీరోగా నెల్సన్ ఓ సినిమా చేయాలి. కానీ, ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నారు. సేమ్ టైమ్ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోసం శింబు ఓ సినిమా చేయాలి దాని ప్లేస్‌లోనే వేట్టైమన్నన్ ప్రాజెక్టును సెట్ చేస్తారనే మాట వినిపిస్తోంది. వేట్టైమన్నన్ అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే కథ. యాక్షన్ థ్రిల్లర్. అప్పట్లో శింబు పక్కన హన్సిక నటించారు. జై, దీక్షాసేత్, సంతానం, పూనమ్ కౌర్, వీటీవీ గణేష్ ఇతర పాత్రలకు సెలక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒకవేళ ప్రాజెక్టుకు దుమ్ముదులిపితే అదే కాస్టింగ్‌ని మెయింటెయిన్ చేస్తారా, మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది వేచి చూడాలి.