English | Telugu
సమంతకు ఇరవై కోట్లు సాయం చేసిన తెలుగు స్టార్ హీరో!
Updated : Aug 4, 2023
తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనదైన ముద్ర వేసిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు, షూటింగ్స్‌కు దూరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటోంది. యోగ, వ్యాయామాలు చేస్తూ ఆధ్యాత్మిక సేవలో ఉంటోంది. అలాగే స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ, సమంతకు సంబంధించిన రూమర్స్ ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు సమంతకు సంబంధించి మరో విషయం కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే..ఆమె టాలీవుడ్‌కి చెందిన ఓ హీరో నుంచి ఆర్థిక సాయం అందుకుందట. ప్రస్తుతం ఆమె సినిమాలు ఏం చేయటం లేదు. మయోసైటిస్ చికిత్స తీసుకుంటుంది. అందుకోసం ఆమె అమెరికా వెళ్లాల్సి ఉంది. భారీగా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కోసం ఆమె టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో నుంచి దాదాపు ఇరవై కోట్లు డబ్బును అప్పుగా తీసుకుందని టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ను తీసుకున్న ఆమెకు అంత మొత్తంలో అప్పు ఎందుకు తీసుకుంది? ఆ మొత్తంలో సమంతకు అప్పుగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరా? అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. మరి ఈ వార్తలపై సమంత కానీ ఆమె టీమ్ కానీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఎందుకంటే సమంతపై కావాలనే కొందరు రూమర్స్ పుట్టిస్తున్నారని, అప్పు తీసుకునే అవసరం సమంతకు లేదనేది వారి వాదన.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత హీరోయిన్‌గా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కావటానికి సన్నద్దమవుతోంది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్‌ను కూడా సమంత పూర్తి చేసింది. అది కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.