English | Telugu
నెవర్ బిఫోర్ అంటున్న కార్తి ఫ్యాన్స్
Updated : Aug 3, 2023
మామూలుగా సినిమా రిలీజ్ అనగానే అందరికీ ముందు వచ్చే అనుమానాలు కొన్ని ఉంటాయి. సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతుంది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఎన్ని భాషల్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు? అని... ప్రీ రిలీజు బిజినెస్‌ల గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. ఇప్పటిదాకా సినిమా కలెక్షన్ల గురించి మాత్రమే పోస్టర్లు చూశాం. కానీ ఓ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ని కూడా సగర్వంగా చెప్పుకుంటోంది ఓ సంస్థ. ఆ సినిమా నటించిన హీరో మరెవరో కాదు.. కార్తి!. అవును. ఆయన నటించిన జపాన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి కనిపిస్తున్న పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. కార్తి హీరోగా నటిస్తున్న 25వ సినిమా జపాన్. దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాను తమిళ్, తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల వరుస విజయాల మీదున్నారు కార్తి. ఆయన వందియదేవర్ వల్లవరాయన్గా నటించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులూ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత నటించిన సర్దార్ కూడా బంపర్ హిట్ అయింది. ఇన్ని సక్సెస్‌లతో ఉన్న కార్తి సినిమాకు బయ్యర్లు ఎగబడి వస్తున్నారు. ఆ క్రేజ్ ఎలా ఉందో జపాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసిన వారికి ఎవరికైనా అర్థమైపోతుంది. జపాన్ సినిమాలోనూ కార్తి డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ టైమ్‌లోనే 150 కోట్ల బిజినెస్ జరిగింది. డిజిటల్, థియేట్రికల్ రైట్స్ కి వచ్చిన క్రేజ్ అమాంతం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్త్ పూర్తయింది. ఇంక ఒకే ఒక పాటను చిత్రీకరిస్తే, కార్తికి సంబంధించిన పోర్షన్ మొత్తం పూర్తయినట్టే. ఈ పాట కోసం భారీ సెట్ వేస్తున్నారు మేకర్స్.
రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తారు మూవీని. ఈ సినిమాతో పాటు కార్తి నలన్ కుమారస్వామి సినిమాలో నటిస్తున్నారు. ఈ అక్టోబర్‌కి ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. కొంచెం గ్యాప్ తీసుకుని ప్రేమ్‌కుమార్ డైరక్షన్లో నవంబర్ ఎండింగ్ నుంచి కార్తి 27వ సినిమా చేస్తారు. ఆ తర్వాత సర్దార్2, ఖైదీ 2 షూటింగుల్లో పాల్గొంటారు. ఈ రెండు సినిమాల షూటింగులను మేకర్స్ 2024లో ప్లాన్ చేసుకుంటున్నారు.