English | Telugu
‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా!
Updated : Aug 4, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. KGF వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావటం కూడా సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. హోంబలే ఫిలింస్ మూవీని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్సయ్యింది. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు సైతం ‘సలార్’ రాక కోసం ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే సినిమాకు మాస్ అప్పీల్ ఉండటంతో సినిమా వసూళ్ల పరంగ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ‘సలార్’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పాన్ వరల్డ్ ప్రభాస్ అభిమానుల కోసం మేకర్స్ ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయటానికి రెడీ అయ్యారు. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే.. ‘సలార్’ రెగ్యులర్ రిలీజ్ డేట్ రోజునే కాకుండా కొన్ని రోజులు ఆలస్యంగా అంటే అక్టోబర్ 13న ఇంగ్లీష్‌లో సలార్ రిలీజ్ అవుతుంది. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్‌గా మెప్పించబోతున్నారు. ప్రభాస్‌లోని మాస్ అండ్ యాక్షన్ కోణాన్ని ప్రశాంత్ నీల్ మరో కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సాలిడ్ హిట్ రాలేదు. దీంతో అందరూ ‘సలార్’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజర్ వంద మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రిలీజైన కొన్ని రోజులకు ప్రభాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ కె సినిమాను విడుదల చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ కె మూవీ రానుంది.