English | Telugu
కట్టప్ప మైల్‌స్టోనీ మూవీ డీటైల్స్
Updated : Aug 3, 2023
మన కట్టప్ప మైల్‌స్టోన్ మూవీ గురించి కోలీవుడ్‌లో ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. సత్యరాజ్, మనకు బాహుబలిలో కట్టప్పగా పరిచయం కావడానికి ముందు, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా, పక్కా పోలీస్ ఆఫీసర్‌గా, మంచి ఫ్యామిలీమేన్‌గా తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు. చాలా తమిళ సినిమాలు చేశారు. తెలుగులో బాహుబలి హిట్ కావడంతో మనకు కట్టప్పగా సుపరిచితులయ్యారు. ఆ సినిమాలో బాహుబలిని పొడిచి, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సత్యరాజ్ కెరీర్‌లో సైడ్ యాక్టర్‌గా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత మెయిన్ విలన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత హీరో అయ్యారు.
ఇప్పుడు ది బెస్ట్ కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఆయన 250 సినిమా సెట్స్ మీదుంది. ఈ సినిమాకు జాక్సన్ దురై2 అనే పేరు పెట్టారు. 2016లో విడుదలైంది జాక్సన్ దురై. హారర్ కామెడీ సినిమా ఇది. 68 ఏళ్ల వయసులో ఈ సినిమా కోసం ఫిట్‌గా కనిపిస్తున్నారు సత్యరాజ్. 250వ సినిమా కావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుమారుడు శిబిరాజ్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ధరణీధరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ పార్టుకు కూడా ఆయనే డైరక్టర్. ఈ సినిమాకు సంగీతం సిద్ధార్థ్ విపిన్ అందిస్తున్నారు. కల్యాణం వెంకట్రామన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.