English | Telugu

‘బిగ్ బ్ర‌ద‌ర్’ డైరెక్టర్‌కి గుండెపోటు

ప్ర‌ముఖ మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ సిద్ధిఖీ గుండె పోటుతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయన వ‌య‌సు 69 ఏళ్లు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్రిటికల్‌గా ఉంద‌ని స‌మాచారం.ఇది ఆయ‌న అభిమానుల‌ను, సినీ ప్ర‌ముఖులను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తుంది. ఆయ‌న తెలుగు, త‌మిళ, హిందీ సినిమాలను డైరెక్ట్ చేశారు. లాల్ అనే యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌లు సినిమాల‌ను సిద్ధిఖీ తెర‌కెక్కించారు. తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే హీరో నితిన్‌తో మారో అనే మూవీని రూపొందించారు. డైరెక్ట‌ర్‌గానే కాకుండా న‌టుడిగానూ కొన్ని సినిమాల్లో న‌టించి మెప్పించారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘జైల‌ర్’ జోరు

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘జైల‌ర్’. గత రజినీకాంత్ చిత్రాల్లో దేనికీ లేని విధంగా ఈ సినిమాకు క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. త‌మిళ‌నాడులో ర‌జినీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ క‌దా, అక్క‌డ ఆయ‌న సినిమాల‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రుగుతాయ‌ని అనుకుంటే పొర‌బ‌డ్డ‌ట్టే. ఎందుకంటే త‌మిళ‌నాడులోనే కాదు.. అటు ఓవ‌ర్ సీస్, ఇటు క‌ర్ణాట‌క‌లోనూ ‘జైల‌ర్’ జోరు మీదున్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకెళ్లిపోతున్నాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వెయ్యి రూపాయ‌ల‌కు పైగానే టికెట్స్ అమ్ముతున్నా ధ‌ర‌ను ఫ్యాన్స్ లెక్క చేయ‌టం లేదు. ఎగ‌బ‌డి మ‌రీ కొంటున్నారు. జైల‌ర్ దెబ్బ‌కి భోళా శంక‌ర్ అయితే స్లో అయిపోయాడు మ‌రి.

పవన్, ఎన్టీఆర్ రికార్డులని మహేష్ బ్రేక్ చేస్తాడా?

ఇప్పటిదాకా వారి కాంబినేషన్ లో వచ్చింది రెండు సినిమాలే అయినప్పటికీ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబోకి టాలీవుడ్ మంచి క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'పోకిరి' సంచలన వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వీరి కాంబోలో రెండో సినిమాగా వచ్చిన 'బిజినెస్ మేన్' పోకిరి స్థాయి సంచలనాలు సృష్టించనప్పటికీ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఎందరో కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.

ఇండ‌స్ట్రీపై ప‌డ‌తారేంటి అంటూ జగన్ సర్కార్‌కి చిరంజీవి మాస్ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.అయితే సినిమాల పరంగా కాదు.. రాజ‌కీయాల ప‌రమైన కామెంట్స్‌తో. అదేంటి? ఇప్పుడు చిరంజీవి రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు క‌దా. అన్నీ పార్టీల‌కు సంబంధించిన వ్య‌క్తులు ఆయ‌న‌తో స‌న్నిహితంగానే ఉంటున్నారు క‌దా. ఇప్పుడు మ‌ళ్లీ ఏమైంది?  ఆయ‌న మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా చేసిన కామెంట్స్ ఏంటి? స‌ంద‌ర్భ‌మేంటనే వివ‌రాల్లోకి వెళితే, సోమ‌వారం సాయంత్రం చిరంజీవి హీరోగా న‌టించిన ‘వాల్తేరు వీర‌య్య’ సినిమాకు సంబంధించిన 200 డేస్ సెల‌బ్రేష‌న్స్ హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిరంజీవి మాట్లాడుతూ ఇన్‌డైరెక్ట‌గా ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. పర్టికుల‌ర్‌గా చిరంజీవి ఏపీ ప్ర‌భుత్వాన్నే టార్గెట్ చేశార‌ని చెప్ప‌టానికి కార‌ణం ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌ట‌మే.

‘పుష్ప 2’ రిలీజ్ ప్లానింగ్.. షూటింగ్ అప్‌డేట్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ‘పుష్ప 2’ సినిమాను పూర్తి చేయ‌టంతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. అందుకు కార‌ణం ‘పుష్ప ది రైజ్‌’కు కొన‌సాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం బ‌న్నీ ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు స‌హా ట్రేడ్ వ‌ర్గాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గ‌ర ఏ మేర‌కు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌నుందనే దానిపై ఇప్ప‌టి నుంచే లెక్క‌లు మొద‌ల‌య్యాయి. ఓ వైపు బ‌న్నీ, సుకుమార్ అండ్ టీమ్ షూటింగ్ ప‌నుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ఆ మ‌ధ్య అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఇచ్చిన వీడియో, ఫస్ట్ లుక్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి కోసం ఎంత దూరమైనా వెళ్తా.. అల్లు అరవింద్ మాస్ వార్నింగ్!

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై 2011 లో జీవిత, రాజశేఖర్ దంపతులు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ పేరుతో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఏకంగా 12 ఏళ్ళ తర్వాత ఇటీవల నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ దంపతులకు రూ.5000 జరిమానాతో పాటు ఏడాది శిక్ష జైలు శిక్ష విధించింది.

చిరంజీవితో క‌లిసి న‌టించ‌బోయే హీరో ఎవ‌రంటే!

మెగాస్టార్ చిరంజీవి దృష్టంతా ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాపైనే ఉంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. దీని త‌ర్వాత చిరంజీవి ఏ మూవీలో చేస్తార‌నే దానిపై అధికారిక స‌మాచారం అయితే లేదు. కానీ మీడియా స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చిరు సినిమా ఉంటుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మించ‌నున్నాయి. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ని టాక్‌. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ చిత్రం స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు.

మ‌హేష్ ఇంట కొత్త కారు.. ధ‌రేంతో తెలుసా!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో పాటు ఇత‌ర వ్యాపారాల్లోనూ పెట్టుబ‌డులు పెడుతున్నారు. అలాగే సినిమాల‌తో పాటు క‌మర్షియ‌ల్ యాడ్స్ చేస్తూ కూడా బిజీగా ఉన్నారు. ఆయ‌న లైఫ్ స్టైల్  గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కార్ గ్యారేజ్‌లో ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఓ కాస్ట్‌లీ రేంజ్ రోవ‌ర్‌ను మ‌హేష్ కొన్నార‌ని, దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివ‌రాల మేర‌కు మ‌హేష్ కొన్న ఆ రేంజ్ రోవ‌ర్ కారు ధ‌రేంతో తెలిస్తే.. వామ్మో అనాల్సిందే. ఏకంగా రూ.5.5 కోట్లు. ఏరి కోరి మ‌హేష్ గోల్డ్ క‌ల‌ర్ రేంజ్ రోవ‌ర్‌ను కొన్నారు.

వైఎస్ జగన్‌తో దిల్ రాజు మీటింగ్‌..!

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్ రాజు ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఇది ఆయ‌న‌కు కొత్త బాధ్య‌త‌. రీసెంట్‌గా జ‌రిగిన ఛాంబ‌ర్‌ ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నిక కావ‌టంలో అల్లు అర‌వింద్‌లాంటి పెద్దలు హ‌స్తం ఉంది. స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ కూడా భారీగానే జ‌రిగాయి. ఇప్పుడు దిల్ రాజు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రీ ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లుస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టికెట్ ధ‌ర‌ల విష‌యంలో స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే దిల్ రాజు స‌హా కొంత మంది నిర్మాత‌లు జ‌గ‌న్‌, సంబంధిత మంత్రుల‌ను క‌లిశారు.