English | Telugu
రష్మిక ఖాతాలో మరో భారీ చిత్రం
Updated : Aug 7, 2023
శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌ను మళ్లీ తన కిట్టీలో చేర్చుకుంటోంది. ప్రస్తుతం ఆమె రెయిన్ బో అనే ద్వి భాషా చిత్రంతో పాటు పుష్ప 2 సినిమా చేతిలో ఉంది. మరో వైపు రణ్‌భీర కపూర్, సందీప్ వంగా కాంబినేషన్‌లో రూపొందుతోన్న యానిమల్ సినిమాలోనూ రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలవుతుంది. ఇది కాకుండా బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో ఓ మూవీ చేయబోతుంది. ఇవన్నీ కాకుండా మరో భారీ బడ్జెట్ చిత్రంలోనూ రష్మిక నటించనుంది.
వివరాల్లోకి వెళితే.. సౌతిండియాలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్...‘2018’ మూవీ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసెఫ్‌తో ఓ సినిమాను చేయనుంది. ఇది వరకే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మేకర్స్ హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపిక చేసుకున్నారు. ముందుగా మాళవికా మోహనన్, రష్మిక మందన్న పేర్లు కథానాయకిలుగా పరిశీలనలోకి వచ్చాయి. చివరకు నిర్మాతలు రష్మిక మందన్న వైపుకే మొగ్గు చూపారు.
త్వరలోనే రష్మిక, లైకా ప్రొడక్షన్స్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది వరకే రష్మిక, కార్తి హీరోగా నటించిన సుల్తాన్... దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు (వారసుడు) సినిమాల్లో రష్మిక హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ మూవీ మూడో సినిమా కానుంది.